ఉత్తరాఖండ్ వరదలు: పవన్ కళ్యాణ్ 20 లక్షల విరాళం
posted on Jun 22, 2013 4:38PM
.jpg)
ఎవరినైనా ఆదుకోవడంలో ముందుంటాడని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు పేరుంది. ఆయన అందరికీ సాయం చేసి అప్పుల పాలయ్యారని, తన ఆస్తులు అమ్ముకుంటున్నారని వార్తలు వచ్చాయి. తాజాగా వరద బాధితులకు సాయం ప్రకటించి పవన్ కళ్యాణ్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఉత్తరాఖండ్ వరద బాధితుల కోసం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 20 లక్షల రూపాయల విరాళం అందించారు. ఉత్తరకాశీ పుణ్యక్షేత్రం దర్శనార్ధం ఉత్తరాఖండ్ కు దేశ నలుమూలల నుంచి వచ్చిన అనేకమంది వరదల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు 556 మంది చనిపోయారు. వందలాది మంది ఆచూకీ తెలియడం లేదు. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ బాధితులకు అండగా నిలవాలని, ఆర్థికసహాయం అందించాలని కేంద్రం విరాళాలు కోరుతోంది. దీంతో తన వంతుగా పవన్ కళ్యాణ్ రూ.20 లక్షలు ప్రకటించారు.