అల్లు అర్జున్ తో హరీష్ శంకర్ సినిమా
posted on Jun 23, 2013 11:16AM
.jpg)
'జులాయి' మూవీ తో సూపర్ హిట్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల వచ్చిన 'ఇద్దరమ్మాయిలతో' కమర్షియల్ హిట్ ఇచ్చి మంచి జోరు మీద ఉన్నాడు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'రేసు గుర్రం' సినిమా చేస్తున్నాడు. దీని తరువాత అల్లు అర్జున్ హరీష్ శంకర్ డైరెక్షన్ ల్లో సినిమా చేయడానికి ఒకే చెప్పాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి 'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బాస్టర్ ఇచ్చిన హరీష్ శంకర్ ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో 'రామయ్య వస్తావయ్య' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్‌ని డెరైక్ట్ చేయనున్నారు హరీష్‌శంకర్. ఈ సినిమాను పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా హరీష్‌శంకర్ తెరకెక్కించనున్నారని సమాచారం. దీంతో మెగా అభిమానులను ఆయన మరోసారి అలరించడం ఖాయమని ఇప్పటికే ఫిలింనగర్ వర్గాలు నమ్మకం వ్యక్తం చేస్తున్నాయి.