పవన్‌తో దిల్‌రాజు సినిమా
posted on Aug 2, 2013 1:03PM
.jpg)
చాలా రోజులుగా ఓస్టార్ హీరో డేట్స్ కోసం వెయిట్ చేస్తున్న దిల్‌రాజుకి ఇన్నాళ్లకు ఆ చాన్స్ వచ్చింది. గతంలో ఎన్నో సార్లు ఆ హీరోతో సినిమా చేయడానికి ప్రయత్నించిన వర్క్ అవుట్ కాకపోవటంతో తన సినిమాలు డిస్ట్రిబ్యూషన్ మాత్రమే చేస్తున్నాడు.
టాలీవుడ్ లక్కీ నిర్మాతగా క్రేజ్ తెచ్చకున్న యంగ్ పొడ్యూసర్ దిల్‌రాజు. నిర్మాతగా మారిన పదేళ్ల కెరీర్‌లో దాదాపు అందరు అగ్ర హీరోలతో సినిమాలు చేశాడు దిల్ రాజు. కాని ఇంతవరకు పవన్ కళ్యాణ్‌తో మాత్రం సినిమా చేయలేదు.
అయితే ఇన్నాళ్లకు ఆ చాన్స్ కొట్టేశాడు దిల్‌రాజు. గతంలో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలోనే పవన్‌ను తీసుకోవాలని అనుకున్న పవన్ మాత్రం ఒప్పుకోలేదు.. ఇప్పుడు మాత్రం పవన్ హీరోగా దిల్‌రాజు ఓ సినిమా చేస్తున్నాడు..
బృందావనం లాంటి బ్లాక్ బస్టర్ సినిమా అందించిన వంశీపైడిపల్లి పవన్ కళ్యాణ్ కోసం ఓ కథ రెడీ చేశాడట. ఇప్పటికే పవన్‌కు కధ కూడా వినిపించిన వంశీ దిల్‌రాజు నిర్మాతగా ఈ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు.
ప్రస్థుతం రామచరన్ హీరోగా నటించిన ఎవడు సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న వంశీ పైడిపల్లి ఆసినిమా రిలీజ్ తరువాత పవన్ హీరోగా చేయబోయే సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేయనున్నాడు.
వరుసగా బ్లాక్ బస్టర్‌లు ఇస్తున్న దిల్‌రాజు బ్యానర్‌లో పవన్ లాంటి భారీ కలెక్షన్ స్టామినా ఉన్న హీరో నటిస్తే ఆ సినిమా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది అంటున్నారు ఫ్యాన్స్.