సల్మాన్‌కూ వీసా ప్రాబ్లమ్
posted on Aug 3, 2013 3:35PM
.jpg)
భారతీయులకు విదేశి విమానాశ్రయాల్లో అవమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. గతంలో మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంనే పూర్తిగా చెక్ చేసి అవమానించిన తెల్లదొరలు. తరువాత కేవలం పేరులో ఖాన్ ఉన్న పాపానికి షారూఖ్‌ను గంటల పాటు విమానాశ్రయంలో ఆపేశారు. అప్పట్లో ఈ విషయాలపై తీవ్రదూమారమే చెలరేగింది.
ఇప్పుడు మరోసారి ఇలాంటి సంగటనే మరో బాలీవుడ్ స్టార్‌కు ఎదురైంది. చాలా రోజులుగా కేసులతో సతమత మవుతున్న కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌కు ఈ సమస్య ఎదురైంది. జింకల వేటకు సంభందించిన చాలా కాలంగా కోర్టు చుట్టూ తిరుగుతున్న సల్మాన్ ఖాన్. ఇప్పుడు ఆ కేసు వల్లే బ్రిటన్ వేళ్లే అవకాశం కూడా కోల్పోయాడు.
కేసు విషయంలో హియరింగ్‌లకు హాజరవుతున్న సల్మాన్ కేసుకు సంబందించిన వివరాలను పూర్తిగా ఎంబసీకి సమర్పించనీ కారణంగా బ్రిటన్ అధికారులు సల్మాన్‌కు విసా నిరాకరించారు. ఈ విషయం తెలుసుకున్ సల్లూ భాయ్ అభిమానులు బ్రిటీష్ అధికారులపై దుమ్మెత్తి పోస్తున్నారు.