పరకాలతో పాట్లు

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా ఉన్న పరకాల ప్రభాకర్ పై ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం గుర్రుగా ఉందన్న వార్తలు వస్తున్నాయి. అసలు అన్ని విషయాల్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకొని.. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించి నిర్ణయం తీసుకునే చంద్రబాబుకు పరకాల వల్ల ఇబ్బందులు వచ్చాయనడంలో సందేహం లేదు. సీఎం సలహాదురుడిగా ఉన్న పరకాలను ఈమధ్యజరిగిన సభత్య నమోదు కార్యక్రమంలో సభ్యుడిగా ఉండమంటేనే ఉంటలేదు... అలాంటిది అతనికి సీఎం ఎంతో గొప్పగా.. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిపించే గోదావరి మహాపుష్కరాలకు ఛైర్మన్ గా నియమించారు. అయితే పరకాల మాత్రం ఈ విషయంలో కూడా విఫలమైనట్టు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వలో ఉన్న అన్ని శాఖలు, మంత్రులు, అధికారులు వీళ్లను మర్చిపోయినట్టున్నారు పరకాల. అందుకే ఎవరితో ఎటువంటి సంప్రదింపులు లేకుండా తన ఇష్టంవచ్చినట్టు నిర్ణయం తీసుకున్నారని రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి.

 

అంతేకాక ఎవరిని సంప్రదించకుండా అన్నీ గాలికొదిలేసి ఈ కార్యక్రమానికి అవ్వాల్సిన ఖర్చుగురించి రూపాయికి నాలుగు రూపాయిలు వేసి చూపించారట. పాపం చంద్రబాబు జపాన్ నుండి తిరిగివచ్చి ఆ లిస్ట్ చూసి జుట్టుపీక్కుని ఆఖరికి అన్నిటినుండి 70% వరకూ కట్ చేసి అన్ని ఖర్చులు తగ్గించారట. అక్కడితో ఆగారా.. అన్ని న్యూస్ కెమేరాల మాదిరిగానే నేషనల్ జియోగ్రాఫిక్ చానల్ కెమేరా కూడా షూటింగ్ చేసుకుందని.. అందుకోసమే కొంచం ఆలస్యమైందని నోరుజారారు. మరోవైపు ఎవరి అనుమతులు లేకుండా తనకు ఇష్టమైన ఛానల్ కు పెద్ద మొత్తంలో డబ్బులు కట్టపెట్టారనే వార్తలు కూడా కట్టపెట్టారనే వార్తలు కూడా వినిపించాయి. దీంతో అటు చంద్రబాబుని.. పార్టీని ఇబ్బందులకు గురిచేశారు. అయితే ఇప్పుడు అందరికి అర్ధమవ్వని విషయం ఏంటంటే ఇన్ని జరిగినా పరకాల రాజీనామా చేస్తారని అనుకున్నారు కానీ తాను మాత్రం రాజీనామా చేయలేదు సరికదా అప్పటినుండి మొహం మాడ్చుకుని కూర్చున్నారు. కానీ అదే పరకాల తనకు తానుగా రాజీనామా చేస్తే పరిస్ధితి వేరేలా ఉండేదని అనుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు చంద్రబాబు ఇంత జరిగినా పరకాల మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అని చెవులు కొరుక్కుంటున్నారు. ఇవన్నీ చాలదన్నట్టు పరకాల వ్యతిరేక వర్గం ఇప్పటికే పరకాలది ఐరన్ లెగ్ అని ప్రచారం చేస్తున్నారు. మరి దీనికి కాలమే సమాధానం చెప్పాలి.