పన్నీర్ సెల్వం సంచలన వ్యాఖ్యలు..పళనిస్వామికి అర్హత లేదు..

 

తమిళనాడు రాజకీయాలు మరో మలుపు తిరిగాయి. గత కొద్ది రోజుల నుండి కాస్త పరిస్థితులు నెమ్మదించాయి అనుకునే లోపు మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. దినకరన్ అరెస్ట్ తో పన్నీర్ సెల్వం వర్గం, శశికళ వర్గం రెండూ ఒకటవుతాయి అని అందరూ అనుకున్న సంగతి తెలిసిందే. ఇక రెండు వర్గ నేతలు సమావేశాలు అవ్వడంతో ఇక కలిసిపోయినట్టే అనుకున్నారు. అయితే ఇప్పుడు పన్నీర్ సెల్వం శశికళ వర్గంపై విమర్శలు గుప్పించారు. తమిళనాడులో ఎడపాడి పళనిస్వామి పాలన చెల్లదని స్పష్టం చేశారు. పళనిస్వామిని ముఖ్యమం‍త్రిగా శశికళ నియమించినందున ఆయనకు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదన్నారు. పార్టీ బాధ్యతలను తాను మాత్రమే నిర్వహించగలనని చెప్పారు. మరి దీనిపై పళని స్వామి ఎలా స్పందిస్తారో చూద్దాం..