సీఎం పక్కన సీటు కోసం..పొట్లాడుకున్న మంత్రులు

ముఖ్యమంత్రి పక్కన కూర్చొవాలని ఎవరికీ ఉండదు చెప్పండి. రోజూ సీఎంని చూస్తున్నా సరే బహిరంగ వేదికలపై ఆయన పక్కన కూర్చోవాలని మంత్రులు సైతం తాపత్రాయ పడతారు. ఇప్పుడు ఆ కోరికే తమిళనాడులో రచ్చ రచ్చ చేసింది. అన్నాడీఎంకే వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎంజీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా తిరుప్పూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు సీఎం పళనిస్వామి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అయితే వేదిక మీద ముఖ్యమంత్రి పక్కన కూర్చోనే విషయంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రి రాధాకృష్ణన్, డిప్యూటీ స్పీకర్ పొల్లాచి జయరామన్ మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది..దీంతో ఇరువురి మద్ధతుదారులు ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగారు. గొడవ మరి పెద్దది అవుతుండటంతో సీఎం పళనిస్వామి కలగజేసుకుని ఇద్దరు నేతలను శాంతింపజేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu