మరో బాదుడుకు రెడీ అవుతున్న బ్యాంకులు
posted on Jun 7, 2017 12:08PM
.jpg)
పెద్ద నోట్ల రద్దు తర్వాతి నుంచి ఖాతాదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న పెద్ద బ్యాంకులు సందు దొరికినప్పుడల్లా ఆ ఛార్జీలు..ఈ ఛార్జీలంటూ జనాన్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా మరో కొత్తరకం ఛార్జీలకు రెడీ అవుతున్నట్లు సమాచారం. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్ (యూపీఊ) విధానం ద్వారా చేసే పీర్-టూ-పీర్ పేమెంట్లపై ఛార్జీల మోత మోగించనున్నాయి.
దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ జులై 10 నుంచి వీటిని అమల్లోకి తీసుకురానుంది. ఇప్పటికే దీనిపై తమ ఖాతాదారులకు మెయిల్స్, మెసేజ్‌ల రూపంలో సమాచారం అందించింది. హెడ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తమ వినియోగదారులకు పంపిన ఈ-మెయిల్ ప్రకారం ఈ లావాదేవీలపై 25 వేల రూపాయలకు మూడు రూపాయలు..25వేలకు పై నుంచి లక్ష మధ్యలో మొత్తానికి ఐదు రూపాయలు దానికి అదనంగా పన్నులు ఉంటాయి. అయితే డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించడానికి, నగదు చెల్లింపులను తగ్గించడానికి ఈ ఛార్జీలపై పునరాలోంచాలని నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా బ్యాంకులను కోరింది.