జగన్ ఛాంబర్‌కు చిల్లు..అసెంబ్లీని పరిశీలించిన వైసీపీ

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సమీప ప్రాంతాల్లో నిన్న కురిసిన భారీ వర్షం ప్రజలను బెంబెలేత్తించింది. సచివాలయం బురదమయంగా మారింది. అసెంబ్లీ భవనంలోని ప్రతిపక్షనేత వైఎస్ జగన్ ఛాంబర్‌లోకి వర్షపు నీరు చేరింది. సిబ్బంది బక్కెట్ల సాయంతో నీటిని ఎత్తిపోశారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు ఇవాళ అసెంబ్లీలోని జగన్ ఛాంబర్‌ను పరిశీలించారు. ఇదే విషయమై అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణను కలవగా..జగన్ ఛాంబర్‌లోకి వర్షపు నీరు ప్రవేశించిన మాట నిజమేనన్నారు. ఇది లీకేజీ కాదని..కిటికీ అద్దాలు తెరిచి ఉండటం వల్లనే నీరు లోనికి వచ్చిందన్నారు. అసెంబ్లీ భవనం పటిష్టంగా ఉందని భయపడాల్సిన అవసరం లేదన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu