పాక్ ప్రధానికి పనామా చిక్కులు.. జిట్ నోటీసులు

 

పాకిస్థాన్‌ ప్రధాన మంత్రి నవాజ్‌షరీఫ్‌ పేరు ఎప్పుడైతే పనామా పేపర్స్ లీకేజీలో ఎప్పుడైతే బయటపడిందో అప్పటినుండి ఆయనను ఆ లీకేజీ వ్యవహారం వెంటాడుతూనే ఉంది. షరీఫ్‌ కుటుంబం లండన్‌లో భారీగా ఆస్తులు కలిగి ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో దీనిపై పిటిషన్ దాఖలవ్వగా.. గతకొద్ది రోజులుగా దీనిపై విచారణ జరుగుతూనే ఉంది. ఇప్పుడు మరోసారి ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది. ఈ కుంభకోణంలో జిట్ బృందం ఆయనకు నోటీసులు జారీ చేసింది. నెల 15న దర్యాప్తు బృందం ఎదుట హాజరై వివరాలు వెల్లడించాలని.. ఈ కేసుకు సంబంధించిన దస్త్రాలు ఇవ్వాలని, తాము అడితే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని జిట్ ఆదేశించింది. దీంతో నవాజ్ షరీఫ్ తొలిసారి జిట్ ముందు హాజరుకానున్నారు.