శివునికి నైవేద్యంగా చేపలకూర... ఎక్కడ..?


శివునికి నైవేద్యంగా చేపలకూర.. వినడానికి కాస్త  ఆశ్చర్యంగా ఉన్నా... ఓ శివుని గుడిలో మాత్రం చేపలకూరనే నైవేద్యంగా పెడుతున్నారు. ఇంతకీ ఆ గుడి ఎక్కుడ అనుకుంటున్నారా...? ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా కొమరాడ మండలంలోని గుంప సోమేశ్వర ఆలయం. ఈ ఆలయంలో శివుడికి చేపల కూర నైవేద్యంగా సమర్పిస్తారు. శివరాత్రి సందర్భంగా ఈ ఆలయంలో ఉత్సవాలను నిర్వహిస్తారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో శివుడికి చేపలు కూర నైవేద్యం సమర్పిస్తారు. చేపలకూర కమ్మగా వండి శివుడికి నైవేద్యంగా పెడితే మనసులోని కోరికలు నెరవేరతాయనేది ఆ ప్రాంతంలోని ప్రజల నమ్మకం. ఎప్పటినుండో ఈ ఆచారం కొనసాగుతుంది. ఇక శతాబ్దాలుగా పూర్వీకులు పాటించిన సంప్రదాయాలను తాము కూడా అనుసరిస్తున్నామని భక్తులు పేర్కొంటున్నారు.