హరీష్‌రావు సభలో ఎంపీటీసీ ఆత్మహత్యాయత్నం

 

తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్‌రావు హాజరైన ఒక సభలో ఎంపీటీసీ ఒకరు ఆత్మహత్యాయత్నం చేశారు. మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ సమావేశంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ వుండగా, జగదేవ్‌పూర్ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన ఎంపీటీసీ భాస్కర్ ఒంటిమీద పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. దాంతో సభలో గందరగోళం నెలకొంది. సభలో పాల్గొన్న వారు ఆయన ఒంటికి నిప్పు అంటించుకోకుండా అడ్డు పడ్డారు. ఇటిక్యాల గ్రామంలో ఓ కుటుంబం గ్రామ బహిష్కరణకు తానే కారణమంటూ వేధిస్తున్నారని, అందుకే ఆత్మహత్యా యత్నం చేశానని సదరు ఎంపీటీసీ చెప్పుకున్నాడు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu