కాల్పులలో మంత్రి సోదరుడు మృతి

 

పాకిస్తాన్ లో జరిగే అక్రమాలకు హద్దూ అదుపూ ఉండవని తెలుసు. అక్కడ సామాన్య ప్రజలకే కాదు ప్రధానులు, మంత్రులు, వారి కుటుంబాలకు కూడా రక్షణ ఉండదనే వాస్తవం మరోసారి రుజువైంది. అబాదీ జావెద్ నగోరి.. సింధ్ ప్రావిన్స్కు మంత్రిగా వ్యవహరిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం లయారీ ప్రాంతంలోని అతని కార్యాలయంపై గుర్తుతెలియని దుండగులు హ్యాండ్ గ్రెనేడ్స్, తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ కాల్పులలో మంత్రి అబాదీ జావెద్ నగోరి సోదరుడు అక్బర్ నగోరి మరణించగా మరో ఆరుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. జరిగిన ఘటనపై వెంటనే దర్యాప్తు చేయాలని సింధ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి ఖయీమ్ అలీ షా ఆదేశించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu