లెఫ్ట్‌కి మమత రైట్ రైట్

 

లెఫ్ట్ పార్టీలంటే భగ్గుమని మండిపడే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పుడు బీజేపీ ధాటికి భయపడి లెఫ్ట్‌తో దోస్తీకి రెడీగా వున్నానని ప్రకటించారు. మతతత్వ శక్తులను ఓడించడానికి లెఫ్ట్ పార్టీలతో కలసి పోరాటం చేయడానికి సిద్ధమని మమతా బెనర్జీ పేర్కొన్నారు. దేశంలో మతతత్వ శక్తుల ప్రాబల్యం పెరిగిపోతే చాలా సమస్యలు వస్తాయని ఆమె వ్యాఖ్యానించారు. మతతత్వ శక్తులతో పోరాడడానికి వామపక్ష శక్తులతో పోరాడడానికి సిద్ధమే. అయితే పశ్చిమ బెంగాల్‌లో మాత్రం కలిసి పని చేసేది లేదు అని ఆమె మెలిక పెట్టారు. సోనియాగాంధీ తనకు మంచి హితురాలని కూడా ఆమె గుర్తు చేసుకున్నారు. మతతత్వ వ్యతిరేక శక్తులకు కాంగ్రెస్‌ నాయకత్వం వహించాలని కూడా మమత అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu