విప్పుతాడా? విప్పడా?

 

 

ఫలానా హీరోయిన్‌ తన రాబోయే సినిమాలో రెచ్చిపోయి ఎక్స్‌పోజింగ్‌ చేసేసిందట, బికినీలూ గికినీలూ వేసేసిందట... అంటూ సినిమాకి ముందే బోలెడంత హడావిడి జరగడం ఇప్పుడు పెద్ద విశేషమేమీ కాదు (కొండకచో... ఒక్కోసారి సినిమా నిర్మాతలే ఇలాంటి ముందస్తు ప్రమోషన్‌లూ చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతుంటారని కూడా అంటుంటారు.) ఇప్పుడు ఒక సినిమా విషయంలో అదే జరుగుతోంది. అయితే ఈ సినిమా విషయంలో హీరోయిన్‌ స్థానాన్ని ఓ హీరో ఆక్రమించడమే విశేషం.

ఆ సినిమా పేరు ‘వన్‌’. ఇక ఆ పేరు చెప్పగానే హీరో ఎవరనేది చెప్పనక్కర్లేదనుకోండి. విషయానికి వస్తే... ఈ సినిమా ప్రారంభించిన దగ్గర్నుంచి అన్నీ స్పెషల్సే. ముఖ్యంగా ఈ సినిమా కోసం హీరో మహేష్‌బాబు... సిక్స్‌ప్యాక్‌ కోసం వర్కవుట్స్‌ చేస్తున్నాడనేది వెరీ వెరీ స్పెషల్‌ న్యూస్‌. అసలే టాలీవుడ్‌ హ్యాండ్సమ్‌ స్టార్‌గా పేరున్న మహేష్‌... సిక్స్‌ప్యాక్‌ కూడా చేస్తే ఇక అమ్మాయిలంతా ఫిదా అయిపోతారనే విషయంలో నో డౌట్‌. ఈ ‘సిక్సీ’లుక్‌ కోసం మహేష్‌ ఓ విదేశీ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ని నియమించుకున్నాడని కూడా వార్తలు వచ్చేశాయి. సరే... అదలా ఉంచితే... సినిమా పూర్తయి, విడుదల తేదీ కూడా నిర్ణయమైపోయింది.

ఇప్పుడు మళ్లీ మహేష్‌ సిక్స్‌ప్యాక్‌ న్యూస్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. దీని సారాంశం ఏమిటంటే... ‘వన్‌’లో మహేష్‌ సిక్స్‌ప్యాక్‌ చూపడం లేదట. తనకు కండలు చూపడం ఇష్టం లేదు కాబట్టి... తాను ఈ సినిమాలో చొక్కా విప్పలేదని మహేష్‌ చెప్తున్నాడట. మరొక వార్త ఏమిటంటే... అసలు మహేష్‌ సిక్స్‌ప్యాక్‌ కోసం ప్రయత్నం చేయనేలేదని, వన్‌లో ఉన్న యాక్షన్‌ సీన్స్‌కు కావల్సిన ఫిట్‌నెస్‌ సాధించడం కోసమే ట్రైనర్‌ను నియమించుకున్నాడని. మొత్తానికి వీటిలో ఏది నిజమో తెలియాలంటే ‘ప్రిన్స్‌’... తెరపై క్రియేట్‌ చేసే ‘వన్‌’డర్‌ ఏమిటో చూడాలంటే... మరికొన్ని రోజులు ఓపిక పట్టాల్సిందే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu