'మా' ఎన్నికలకు కోర్టు గ్రీన్ సిగ్నల్

 

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల పోరు చాలా రసవత్తరంగా సాగుతుంది. ఈ వ్యవహారంపై నటుడు ఓ. కల్యాణ్ శుక్రవారం కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఇరువర్గాల వాదనలు విన్నన్యాయస్థానం, అనంతరం ఎన్నికల నిర్వహణకు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. ఎట్టకేలకు ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ కోర్టు ఆమోదం తరువాతే ఫలితాలు ప్రకటించాలని షరతు విధించింది. అధ్యక్ష పదవికి రాజేంద్ర ప్రసాద్, జయసుధ పోటీ చేస్తున్నారు. వారి ప్యానల్ తరపున ఇతర పదవులకు బరిలో నిలిపారు. చూడబోతే మా ఎన్నికలు రాజకీయ ఎన్నికల కంటే వేడిగా జరిగేలా ఉన్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu