KGF.. చాప్ట‌ర్ 2 చించేసింది.. అంత‌కుమించి.. ప‌వ‌ర్ ప్యాక్డ్ మూవీ..

KGF.. చాప్ట‌ర్ 1 చించేసింది.. చాప్ట‌ర్ 2 అంత‌కుమించి మెప్పించింది. సినిమా కాద‌ది.. అదో బంగారు లోకం. హీరో కాద‌త‌ను స్టైలిష్‌ సూప‌ర్ మ్యాన్‌. యాక్ష‌న్‌, డ్రామా, స్టోరీ, మేకింగ్‌, టేకింగ్‌, మ్యూజిక్‌, గ్రాఫిక్స్‌, డైలాగ్స్‌.. ఒక్క‌టేమిటీ.. పీస్ టు పీస్‌.. మాస్ట‌ర్ పీస్‌. సీన్ టు సీన్‌.. గూస్ బంప్స్‌. థియేట‌ర్ల‌లో దుమ్ముదుమార‌మే. అస‌లుసిస‌లైన పాన్ ఇండియా మూవీ.. KGF. చాప్ట‌ర్ 1 & 2.

ప్ర‌శాంత్ నీల్‌. ఇన్నాళ్లు ఎక్క‌డున్నావయ్యా. KGFతో మెస్మ‌రైజ్ చేసి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తే.. చాప్ట‌ర్ 2తో గోల్డెన్ రికార్డ్స్ క్రియేట్ చేయ‌డం ఖాయం. సినిమా మామూలుగా లేదు. ఓ రేంజ్‌లో.. చాప్ట‌ర్ 1కు ఏమాత్రం త‌గ్గ‌కుండా.. అంత‌కుమించి అనేలా ఉంది.  

రాక్ స్టార్ యశ్ ఎంట్రీ అదిరిపోయింది. యశ్ స్టైలింగ్ అదుర్స్‌. డైలాగ్స్ కెవ్వు కేక‌. ప్రేక్షకులకు పూనకాలే.  మాస్ సీన్స్ కేజీఎఫ్‌1ను మ‌రిపిస్తాయి. అమ్మ సెంటిమెంట్‌, ఎమోష‌న్స్ ర‌క్తి క‌ట్టిస్తాయి. ఇంటర్వెల్ సీన్స్‌కి వెంట్రుక‌లు నిక్క‌బొడుచుకోవాల్సిందే. క్లైమాక్స్ ర‌చ్చ రంబోలే. విల‌న్‌గా సంజ‌య్ ద‌త్ రోల్ బెదుర్స్‌. హీరోలానే ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్‌. 

మూవీ ఎంత బాగుందంటే.. సినిమా చూసేట‌ప్పుడు.. మీరొక క్ష‌ణం త‌ల ప‌క్క‌కు తిప్పారంటే.. ఓ అద్భుత‌మైన షాట్ మిస్ అయిన‌ట్టే. ప్ర‌తీ ఫ్రేమ్ అంత బాగా తీశారు. కెమెరా, ఆర్ట్ వ‌ర్క్ బ్ర‌హ్మాండంగా ఉంది. మ్యూజిక్ మీ ఊపిరిని ఆపేస్తుంది. ఎమోష‌న్స్‌తో ఆటాడేసుకుంటుంది. ప్ర‌తీ 10 నిమిషాల‌కోసారి గూస్‌బంప్స్ తెప్పించే సీన్ వ‌స్తూనే ఉంటుంది. సినిమా అంతా.. అలా అలా మెప్పిస్తూనే, మైమ‌రిపిస్తూనే ఉంటుంది. సీక్వెల్ అంటే ఇదే. కేజీఎఫ్ కేజీఎఫ్ఫే. చెప్పేదేముంది బాస్‌.. అర్జెంట్‌గా వెళ్లి చూడండి. మ‌ళ్లీ మ‌ళ్లీ చూసేయండి. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu