యూనివర్సిటీపై దాడి.. 15 మంది

 

మృతి కెన్యాలోని గరిస్సా విశ్వవిద్యాలయంలో ఉగ్రవాదులు ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది విద్యార్ధులు, సిబ్బందికి గాయాలయ్యాయి. ఉగ్రవాదులు కొంతమంది విద్యార్ధులను బందీలుగా పట్టుకున్నట్టు తెలిసింది. సమాచారం అందుకున్న కెన్యా భద్రతాదళాలు వర్సిటీని చుట్టుముట్టి దుండగుల కోసం వేట ప్రారంభించాయి. ఇదిలా ఉండగా ఈ ఘటనకు తామే బాధ్యులమని సొమాలియాకు చెందిన ఉగ్రవాదసంస్థ అల్ షబబ్ ప్రకటించింది.