కేసిఆర్, కోదండరామ్‌లపై కేసు నమోదు
posted on Jan 31, 2013 2:44PM

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయంలో కేసిఆర్, కోదండరామ్‌లపై విశాఖలో కేసు నమోదైంది. కేసిఆర్, కోదండరామ్‌లు జాతీయ నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ సమైక్యాంధ్ర ఐక్యకార్యాచరణ సమితి పిర్యాధు చేసింది. దీనిని విచారణకు స్వీకరించిన విశాఖ న్యాయ సదన్ కోర్టు ఫిబ్రవరి 15న హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.
దేశంపై, ప్రధానిపై కేసిఆర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సీమాంధ్రలో వరుసగా కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం గుంటూరులోని ఆరండల్‌పేట పోలీసు స్టేషన్‌లో కెసిఆర్‌పై సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నాయకులు ఫిర్యాదు చేశారు. సీమాంధ్రులను దొంగలు అనడంపై కెసిఆర్ మీద ఫిర్యాదు చేశారు. అలాగే, దిక్కుమాలిన దేశంలో తెలంగాణ కోసం ఇంకా ఎన్ని ఉద్యమాలు చేయాలని కెసిఆర్ ప్రశ్నించడంపై, చప్రాసీకి ఉన్న తెలివి ప్రధానికి లేదని కెసిఆర్ చేసిన వ్యాఖ్యలపై కూడా వారు ఆరండల్‌పేట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.