మూడోసారి చెర్రీతో కాజల్ రొమాన్స్
posted on Dec 31, 2013 9:00AM

కృష్ణవంశీ దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కనుంది. రామ్ చరణ్, శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటించనున్నారు. అయితే చరణ్ సరసన నటించే హీరోయిన్ కోసం దర్శకుడు గతకొంత కాలంగా వెతుకుతూనే ఉన్నాడు. ఈ సినిమాలో ముందుగా హీరోయిన్ గా తమన్నాను అనుకున్నారు. కానీ తమన్నా ప్రస్తుతం తెలుగులో "ఆగడు", "బాహుబలి" చిత్రాలతో పాటు, హిందీలో రెండు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంది. అందుకే తమన్నా స్థానంలో తాజాగా కాజల్ ను ఎంపిక చేసారు. "బాద్ షా" తర్వాత తెలుగులో కాజల్ ఏ ఒక్క చిత్రం కూడా ఒప్పుకోలేదు. దాంతో ఈ చిత్రంలో నటించేందుకు కాజల్ వెంటనే ఒప్పేసుకుంది. పైగా కాజల్ కు "చందమామ" చిత్రంతో హీరోయిన్ గా మంచి పేరు వచ్చేలా చేసిన దర్శకుడు కృష్ణవంశీ చిత్రం కావడం వలన వెంటనే ఒప్పేసుకుంది."మగధీర", "నాయక్" చిత్రాల తర్వాత చెర్రీ, కాజల్ కాంబినేషన్ ఇది మూడవసారి. ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.