శవాల పైన రాజకీయం చేసే బ్యాచ్.. జూపుడి

 

గోదావరి మహా పుష్కరాల్లో భాగంగా రాజమండ్రి ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో దాదాపు 30 మంది వరకు ప్రాణాలు విడిచారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలకు ఇదే ఛాన్స్ అనుకొని సీఎం చంద్రబాబుపై విమర్శలు మొదలుపెట్టారు. అయితే చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు స్పందించిన జూపుడి ప్రభాకర్ రావు ప్రతిపక్షాలకు ఘాటుగానే మండిపడ్డారు. ప్రమాదం జరిగి ఓవైపు ప్రాణాలు కోల్పోయి ఉంటే బాధితులను ఓదార్చాల్సింది పోయి దాని కారణం సీఎం అంటు.. టీడీపీ అంటూ విమర్సలు చేయడం విడ్డూరమన్నారు. అంతేకాక మేం కూడా ప్రభుత్వానికి సహకరిస్తామని.. పార్టీ తరుపున ఎవరినైనా వాలెంటీర్లను పంపించారా అని ప్రశ్నించారు. శవాల పైన రాజకీయం చేసే బ్యాచ్ అని ధ్వజమెత్తారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu