TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ముగ్గురు సెలబ్రిటీల అనారోగ్యం... ముచ్చెమటల్లో తమిళనాడు!

Published on: Mon Dec 5, 2016 2:29PM


తమిళనాడులో ఇప్పుడు అందరి దృష్టీ ఆసుపత్రుల మీదే వుంది! యెస్... తమిళ సీఎం జయలలిత సీరియస్ గా వుండటంతో రాష్ట్రమంతా ఇప్పుడు చెన్నై అపోలో హాస్పిటల్ వైపే చూస్తోంది! ఇన్ ఫ్యాక్ట్, దేశమంతా కూడా అపోలో ఆసుపత్రి నుంచీ ఎప్పుడు ఏం వార్త వినాల్సి వస్తుందో అని బిక్కుబిక్కుమంటోంది. అయితే, అరవోళ్ల ఆసుపత్రి టెన్షన్స్ ఒక్క అపోలోకే పరిమితం కాలేదు. అన్నాడీఎంకే అభిమానుల్లాగే డీఎంకే అభిమానులు కూడా హాస్పిటల్ వైపు చూస్తున్నారు... 


తొంభై ఏళ్లు పైబడ్డ కరుణానిధి కొన్ని రోజులుగా హాస్పిటల్ లోనే వుంటున్నారు. ఆయనకు ఆరోగ్యం బాగా లేని విషయం తెలిసిందే. అయితే, జయలలిత మాదిరిగా భయపడాల్సిన అవసరం ఏం లేదని చెబుతున్నారు డాక్టర్స్. ఏజ్ వల్ల వచ్చిన వీక్ నెస్, డీహైడ్రేషన్ లాంటి కారణాలే కరుణానిధి హాస్పిటల్ పాలవటానికి కారణమట! కాకపోతే, ఆయన వయసు దృష్ట్యా ఏ కొంచెం అనారోగ్యం అయినా తమిళ జనానికి టెన్షనే!


తమిళనాడులో జయలలిత , కరుణానిధి ఇద్దరూ హాస్పిటల్ లో వుంటే కూడా పెద్దగా ఫీలవ్వని జనం కూడా ఇప్పడు ఆందోళనలోనే వున్నారు! ఎందుకంటే, శనివారం నాడు తలైవా ఆసుపత్రి మెట్టెక్కి వచ్చాడు! డీఎంకే, అన్నాడీఎంకే అన్న భేదాలేం లేకుండా తమిళ తంబీలందరూ రజినీకాంత్ ఫ్యాన్సే. ఆయన రోబో 2.0 షూటింగ్ సందర్భంగా గాయపడి వైద్యం తీసుకున్నారని తెలిసి కాస్త టెన్షన్ అయ్యారు. కాకపోతే, వెంటనే డిశ్చార్జ్ కూడా అయిపోయిన రజినీ ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నాడు. మెట్లెక్కే సీన్ షూట్ చేస్తూ ఆయన గాయపడ్డాడట. కాకపోతే, ఫ్రాక్చర్ లాంటివి ఏం జరగలేదు...


పురుచిరతలైవీ జయలలిత, కలైంగర్ కరుణానిధి, తలైవా రజినీకాంత్... ఇలా ముగ్గురు తమిళ సూపర్ క్రేజీ సెలబ్రిటీస్ ఒకేసారి అనారోగ్యాలతో బాధపడటం నిజంగా బాధకారమే! కాకపోతే, త్వరలోనే అందరూ ఆరోగ్యంగా జనం ముందుకి రావాలనీ కోరుకుందాం. ముఖ్యంగా, ప్రమాదకర స్థితిలో వన్న జయ...