వైజాగ్ తీరంలో... యుద్ధ నౌకపై పార్టీలు చేసుకోవచ్చట! 

 


మీరు ఇప్పటి వరకూ చాలా స్టార్ హోటల్స్ చూసి వుంటారు. లేదంటే రకరకాల కథనాలు విని వుంటారు. కాని, త్వరలో మన వైజాగ్ లో ఏర్పాటు కానున్న ఒక స్టార్ హోటల్ మీరు లైఫ్ లో ఎప్పుడూ ఊహించనిది! అంతలా స్పెషల్ ఏంటి అంటే... అంతా స్పెషలే! అన్నిటికంటే ముఖ్యంగా, అసలు అది సిమెంట్, ఇటుకలు పెట్టి కట్టిన మామూలు బిల్డింగ్ కాకపోవటమే ... అతి పెద్ద ప్రత్యేకత!


ఐఎన్ఎస్ విరాట్... ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? మీకు యుద్ధ నౌకలు, నేవీ అంటే ఆసక్తి వుంటే తప్ప దీని గురించి తెలిసే ఛాన్స్ లేదు.కాకపోతే, ఐఎన్ఎస్ విరాట్ 55ఏళ్లుగా ఎంతో కీలకమైన సేవలందిస్తోన్న ఒక భారీ జల నౌక. ఇది మొదట బ్రిటీష్ వాళ్ల వద్ద వుండేది. కాని, తరువాత బ్రిటన్ రాయల్ నేవీ నుంచి ఇండియన్ నేవీ వద్దకొచ్చింది. 1987 నుంచీ మన జలాల్లో ధీర గంభీరంగా తిరగాడుతోంది. విరాట్ పై నుంచి యుద్ధ సమాయాల్లో విమానాల్ని కూడా టేకాఫ్ చేసే ఛాన్స్ వుంటుంది. అంతటి విశాలమైన చిన్న సైజు దీవి లాంటిది విరాట్!


ఎన్నో ఏళ్లుగా సేవలందించిన విరాట్ ను ఈ సంవత్సరం పూర్తయ్యేలోగా పక్కకు తప్పించాలని భావిస్తోంది నేవీ. మరి దాని తరువాత ఐఎన్ఎస్ విరాట్ జల నౌక భవిష్యత్ ఏంటి? ఇక్కడే అసలు ట్విస్ట్ వుంది! టూరిజం డెవలప్ మెంట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోన్న నవ్యాంధ్ర ప్రభుత్వం విరాట్ ను వైజాగ్ తీరంలో సేద తీర్చనుందట! అంతే కాదు, 500గదుల భారీ స్టార్ హోటల్ అండ్ మ్యూజియంగా మార్చే ఆలోచన కూడా వుందట! అంటే సముద్రంలో ఓలలాడిన మన సగర్వ నౌక జనాల ఆనందాలకి, కేరింతలకి కేరాఫ్ కానుందన్నమాట!


ఐఎన్ఎస్ విరాట్ హోటల్ గా మార్చే విషయమై నేవీ ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చలు జరిపింది. అయితే ఫైనల్ అగ్రిమెంట్లు , పర్మిషన్లు జరిగిపోతే ఒక సరికొత్త పాట్రియాట్రిక్ లగ్జరీ హోటల్ అందుబాటులోకి వచ్చేస్తుంది....