జగన్ బెయిల్ ఆంక్షలు సడలించవద్దు
posted on Sep 30, 2013 2:53PM
.jpg)
ఇడుపుల పాయకు, గుంటూరుకు వెళ్లేందుకు అనుమతివ్వాలన్న వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వేసిన పిటిషన్ పై సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారం సాయంత్రం తీర్పివ్వనుంది. ఐతే జగన్ ను హైదరాబాదు విడిచి వెళ్లేందుకు అనుమతి ఇవ్వవద్దని సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. హైదరాబాదు విడిచి వెళ్లరాదనే షరతు నుంచి జగన్‌కు మినహాయింపు ఇవ్వరాదని సీబీఐ పేర్కొంది. ఆయన నగరాన్ని విడిచి వెళితే జగన్ సాక్ష్యులను ప్రభావితం చేస్తారని సిబిఐ పిటిషన్‌లో పేర్కొంది. 16 నెలల జైలు వాసం తర్వాత వారం క్రితం జగన్ బెయిల్ పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఐతే తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించేందుకు అక్టోబర్ 1, 2 తేదీల్లో ఇడుపులపాయకు వెళ్లడానికి అనుమతించాలని జగన్ కోర్టును కోరారు. దీంతో పాటు గుంటూరుకు కూడా వెళ్లేందుకు అనుమతించాలన్నారు.