జగన్ మెడకి గుదిబండలు ఇవేనా...!

 

ఏపీలోని ఏకైక విప‌క్షం జ‌గ‌న్ నేతృత్వంలోని వైకాపా. అసలు వాస్త‌వానికి 2014లోనే అత్య‌ధిక మెజారిటీతో వైకాపా అధ్య‌క్షుడు జ‌గ‌న్ ఏపీలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తార‌ని అంద‌రూ భావించారు. దీనికి అనుకూలంగానే అనేక విశ్లేష‌ణ‌లు, స‌ర్వేలు కూడా వ‌చ్చాయి. అయితే చంద్ర‌బాబు ఇచ్చిన డ్వాక్రా రుణ‌మాఫీ, రైతురుణ మాఫీలు సైకిల్ స‌వారీ చేయ‌డానికి, టీడీపీ అధికారంలోకి రావ‌డానికి ఎంత‌గానో దోహ‌ద‌ప‌డ్డాయి.  అంతేకాదు, టీడీపీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించి అటు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం..ఇక వారికి పవన్ కళ్యాణ్ కూడా తోడుకావడం వల్ల టీడీపీ ఘన విజయం సాధించి అధికారం చేపట్టింది. కానీ ఎట్టిప‌రిస్థితిలోనూ 2019 ఎన్నిక‌ల్లో అధికారంలోకి  రావాల‌ని.. సీఎం గద్దె ఎక్కాలని గ‌ట్టిగానే ప్ర‌య‌త్నిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడి వరకూ అంతా బాగానే ఉంది.. జగన్ తన వంతు తాను ప్రయత్నిస్తున్నాడు కానీ.. తాను చేసే కొన్ని పనుల వల్ల తాను తీసుకున్న గోతిలో తానే పడే పరిస్థితి వస్తుంది.

 

రాష్ట్రం విడిపోయి కొత్త రాష్ట్రంగా అవతరించి ఇప్పటికి మూడేళ్లు గడిపోయింది. ఇంకా రెండేళ్లు మిగిలంది. ఈ మూడేళ్లలో జరిగిన పాలనపై జరిపిన సర్వేలో కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ఇప్పుడు అవే జగన్ కు గుది బండలుగా మారుతున్నాయా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. ఇంతకీ అవేంటంటే..

 

* టీడీపీ అధికారం చేపట్టిన దగ్గర నుండి జగన్ ఎప్పుడు చూసిన టీడీపీన విమర్శలు చేస్తూనే ఉంటారు. విపక్ష పార్టీలో ఉండి కొత్త రాష్ట్రం ఏర్పాటుకు, అభివృద్ధికి సలహాలు ఇవ్వాల్సింది పోయి.. క్యాపిటల్ కు ఇచ్చిన భూమిని వెనక్కి ఇచ్చేస్తాం అంటూ అనవసరం శబధాలు చేస్తూ చిక్కుల్లో పడుతున్నారు. దీనివల్ల ఈసారి కూడా చంద్రబాబుకు అవకాశం ఇవ్వాలని... లేకపోతే రాష్ట్రం పరిస్థితి దారుణంగా తయారయ్యే అవకాశం ఉందని ప్రజలు అనుకుంటున్నారట. అమరావతి భూమిని వెనక్కి ఇచ్చేసి.. మళ్లీ రాజధానిని ఎక్కడ నిర్మిస్తారు.. ఇప్పటి వరకూ జరిగిన పనుల సంగతి ఏంటి.. ఇవన్నీ జరగాలంటే ఆ పైన వచ్చే మరో ఐదేళ్లు కూడా సరిపోవు... ఇలా అయితే అభివృద్ధి జరిగినట్టే అని.. జగన్ కు కనుక అధికారం కట్టబెడితే రాష్ట్ర అభివృద్ధికి కుంటుపడే అవకాశం ఉందని ప్రజలు ఆలోచిస్తున్నట్టు సర్వేలో తేలింది.

 

* అన్నింటి కంటే ముఖ్యమైన అంశం అనుభవజ్ఞ లేమి. చంద్రబాబు రాజకీయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజకీయ చాణుక్యడనే ఆయనకు మరో పేరు. మరి జగన్ కు ఉన్న రాజకీయ అనుభవం చూస్తూ.. చంద్రబాబు అనుభవం ముందు శూన్యమే. దీనికి ఉదాహరణ కళ్లజోడే.. కళ్లజోడుకి.. అనుభవానికి సంబంధం ఏంటా అని సందేహం రావచ్చు. ఇక్కడే చిన్న విషయం దాగుంది. కళ్లజోడు సినీయార్టికి సింబల్ గా ఉంటుంది. అంతేకాదు చంద్రబాబు అడ్వైజర్లు కూడా కళ్లజోడు పెట్టుకోమని ఆయనకు గత ఎన్నికలప్పుడే సలహా ఇచ్చారు. అప్పటి నుండి చంద్రబాబు కళ్లజోడు మైన్ టైన్ చేస్తూ వస్తున్నారు. అలాంటి మైన్యూర్ థింగ్స్ కూడా చంద్రబాబు ఎంతో జాగ్రత్తగా  చూసుకుంటారు. కానీ జగన్ కు మాత్రం అలాంటి సలహాలు ఇచ్చే వాళ్లు లేరు.

 

* మేథావులను, ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ను పక్కన పెట్టుకోవడం.. కాస్త మంచి స్పోక్స్ పర్సన్స్ ను పెట్టుకునే ప్రయత్నాలు ఎంతమాత్రం జగన్ చేయడంలేదు.  ఎంతవరకూ ఓ మత ప్రచారకుడిలా బుగ్గలు నిమరడం, ముద్దులు పెట్టడం చేస్తుంటాడు. దీనివల్ల అనుభవానికి, అనుభవలేమికి రెండింటికి మధ్య వ్యత్యాసాన్ని టీడీపీ చూపించే ప్రయత్నం చేస్తుంది.

 

* కనీసం మీడియా, తన ఛానల్ సాక్షి ద్వారా అయినా కాస్త మేథావి వర్గంతో పార్టీ గురించి ప్రజలకు చెప్పే ప్రయత్నాలు చేయకపోగా.. ఎప్పుడు చూసినా ఆవేశ పరులైన అంబటి రాంబాబు, రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి నోరేసుకొని పడేవాళ్లు, ఆవేశపరులను పక్కన పెట్టుకొని తిరగడం తప్ప వేరే ఏం కనిపించడం లేదు.

 

* ఇక ఇప్పటికే పోలవరం, అమరావతికి వ్యతిరేకంగా పలుమార్లు విమర్శలు గుప్పించారు. దీంతో వాటికి జగన్ వ్యతిరేకం అనే ముద్ర వేసుకున్నారు. మరి ఇప్పుడైనా వాటిని చేరుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారా అంటే అదీ లేదు.

 

* మరోవైపు ఎన్నో ఏళ్ల క్రిందట స్థాపించబడిన టీడీపీ పార్టీకి గట్టి పునాదులే ఉన్నాయి. పార్టీ వ్యవస్థ కూడా చాలా బలంగా ఉంది.  కానీ జగన్ మాత్రం మూడేళ్లు గడిచిపోతున్నా పార్టీ బలోపేతానికి మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పార్టీ నుండి ఎంతమంది నేతలు జంప్ అవుతున్నా వారిని కట్టడి చేసే ప్రయత్నం చేయట్లేదు.

 

* అన్నింటికంటే ముఖ్యంగా బీజేపీతో పొత్తు విషయం కూడా జగన్ కు మైనస్ గా మారబోతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. జగన్ బీజేపీ తో పొత్తు పెట్టుకుంటే మైనార్టీ వర్గాల నుండి వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉంది. ఇదే కాంగ్రెస్ కు ప్లస్ అవుతుంది అంటున్నారు. అంతేకాదు అక్రమ ఆస్తుల కేసు నుండి బయట పడటానికే జగన్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడని విమర్శలు కూడా వస్తున్నాయి.


* ఆఖరికి జగన్ దీక్షల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఏదో ఒక విషయంపై దీక్షలు పెట్టడం.. ఆఖరికి అవి బిస్కట్ అవ్వ్డడం మామూలైపోయింది. జగన్ కు దీక్షలు రొటీన్ అయిపోయాయి... కొత్తదనం ఏం లేదు... దీక్షల వల్ల వచ్చిన ప్రయోజనం కూడా ఏం లేదని.. దీక్షలు పెట్టి టైం వేస్ట్ చేసే బదులు.. పార్టీ కార్యచరణలపై పెడితే కాస్త ఉపయోగం ఉంటుంది అంటున్నారు.

 

మొత్తానికి జగన్ చేసే తన స్వయం కృపారాదాలే ఆయన మెడకి గుదిబండలుగా తయారై..వచ్చే ఎన్నికలపై ప్రభావం చూపేలా కనిపిస్తున్నాయి అంటున్నాయి రాజకీయ వర్గాలు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu