రైల్వే ప్రయాణికులకు బంపరాఫర్... ముందు ప్రయాణించండి... తరువాత కట్టండి..

 

రైల్వే ప్రయాణికులు.. రైల్వే శాఖ ఓ బంపరాఫర్ ఇచ్చింది. అదేంటంటే. ముందు ప్రయాణించడం.. ఆ తర్వాత డబ్బులు చెల్లించడం. ‘బుక్‌ టికెట్స్‌ నౌ అండ్‌ పే లేటర్‌’ అనే ఈ కొత్త ఆఫ్షన్ ను అందుబాటులోకి తీసుకురావడానికి రైల్వే శాఖ ప్రయత్నిస్తుంది. ఈ  కొత్త పథకం ద్వారా ఐదు రోజుల ముందుగా టికెట్ బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. ముందు బుక్ చేసుకొని ప్రయాణించిన 14రోజుల  లోపు డబ్బులు చెల్లించాలి. దీని కోసం ఐఆర్‌సీటీసీ ఓ సంస్థతో ఒప్పందం చేసుకుంది. అయితే ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా ఈ విధానాన్ని ఎంచుకునే ఇ-టికెట్లలో మాత్రమే ఇది చెల్లుబాటు అవుతుంది.  3.5 శాతం సేవా చార్జీని అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ అధికారి మాట్లాడుతూ...  ఏ ఎక్స్‌ ప్రెస్‌ రైల్‌లో నైనా  ఈ సేవలను పొందవచ్చని  చెప్పారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu