మరో ఇద్దరు ఐసిస్ సానుభూతిపరులు అరెస్ట్...

 

హైదరాబాద్ నగరంలో ఐసిస్ సానుభూతి పరులంటూ 5 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నసంగతి తెలిసిందే. వీరిని కోర్టులో హాజరుపరచగా నలుగురు సానుభూతి పరులకు కోర్టు 10 రోజుల కస్టడీ విధించింది. దీంతో ఎన్ఐఏ అధికారులు వారి దగ్గర నుండి మరింత ఉగ్ర సమాచారం రాబట్టనున్నారు. అయితే కోర్టుకు ఐఎస్ ఉగ్రవాదుల అప్పగింత సమయంలోనే హైదరాబాదులో మరో ఇద్దరు లియామత్‌, అతావుల్లాలను అనే ఐఎస్ సానుభూతిపరులు అరెస్టయ్యారు. 

 

కాగా తాజాగా అరెస్టైన ఇద్దరు ఐఎస్ సానుభూతిపరులను మొఘల్ పురా, బండ్లగూడకు చెందిన అహ్మదుల్లా, యాసిర్ గా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే అరెస్టైన ఐదుగురు ఉగ్రవాదులతో వీరికి సంబంధాలున్నాయని పక్కాగా నిర్ధారించుకున్న తర్వాతే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu