రెండు రైళ్లు ఢీ.. తుక్కుతుక్కుయిన భోగీలు

 

ఎదురెదురగా వచ్చి రెండు రైళ్లు ఢీకొట్టుకొని ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ఘటన ఇట‌లీ ద‌క్షిణ ప్రాంతంలోని బారి నగర సమీపంలో జరిగింది. ఇట‌లీలో ఒకే రైల్వే ట్రాక్‌పై  ఎదురెదురుగా వ‌చ్చిన రెండు రైళ్లు ఢీకొట్టుకున్నాయి. ప్ర‌మాదంలో రెండు రైళ్ల‌కు చెందిన‌ ప‌లు బోగీలు ధ్వంస‌మ‌య్యాయి.  ఇంకా 12 మంది ప్రయాణికులు మరణించగా.. చాలామందికి తీవ్రగాయాలయ్యాయి.  గాయ‌ప‌డిన వారికి ప్ర‌థ‌మ చికిత్స అందించి, ఆసుప‌త్రికి తర‌లిస్తోంది. బోగీల్లో చిక్కుకుపోయిన వారిని బ‌య‌ట‌కు తీస్తోంది. స‌హాయ‌కచ‌ర్య‌లు చేప‌డుతోంది. కాగా ఈ ట్రాక్‌పై 200 రైళ్లు ప్రయాణిస్తుండటంతో ట్రాక్ పై నుంచి వెళ్లే ఇత‌ర రైళ్ల రాక‌పోక‌ల‌కు అంత‌రాయం కలిగింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu