50 లక్షల సమాధులు.. ఇంకేం కనిపించవు..
posted on Jul 12, 2016 5:08PM

ఒకటి కాదు రెండు కాదు ఆ శ్మశానంలో ఏకంగా 50 లక్షల సమాధులు ఉన్నాయి. ఇంతకీ ఆశ్మశానం ఎక్కడ అనుకుంటున్నారా.. ఇరాక్ రాజధాని అయిన బాగ్దాద్ లో ఉంది. ప్రపంచంలోనే అతి పెద్ద శ్మశానంగా రికార్డులకెక్కిన ఈ శ్మశానం..అక్కడికెళ్లి చూస్తే కనుచూపు మేరలో ఇంకేమీ కనిపించవు.. అన్నీ సమాధులే కనిపిస్తాయి. అంతేకాదు కొత్తగా ఏటా 5 లక్షల సమాధులు కూడా పెరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే దీని వెనుక ఓ స్టోరీ కూడా ఉందని చెబుతున్నారు. ఒకప్పుడు ఈ ప్రాంతం షియా ముస్లింల పవిత్ర నగరంగా ఉండేదట. ఇక్కడే షియాల మొదటి మతగురువుని ఖననం చేశారట. అందుకే దీన్ని వదీ అల్ సలామ్(శాంతి లోయ) అని పిలుస్తారు. ఆయన సమాధికి దగ్గరలోనే క్రీస్తు శకం 600 సంవత్సరం నాటి సమాధులు ఉండేవి. ఈ ప్రదేశంలోనే భారీగా సమాధులు నిర్మించారు.