అవినీతి ఆరోపణలతో ఇన్‌కమ్ ట్యాక్స్ కమిషనర్ అరెస్ట్..

 

భారీ మొత్తంలో లంచం తీసుకుంటున్నారన్న అవినీతి ఆరోపణలతో ఆదాయ పన్ను శాఖ ముంబయి కమిషనర్‌ బీబీ రాజేంద్రప్రసాద్‌ను సీబీఐ అరెస్టు చేసింది. ఓ కార్పొరేట్‌ భవనానికి పన్ను మినహాయింపు కల్పించడానికి పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటున్నట్లు సమాచారం రావడంతో రాజేంద్రప్రసాద్‌ నివాసం, కార్యాలయంపై సీబీఐ సోదాలు చేపట్టి రూ. 1.5 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే మొత్తం డీల్ ఇంతకంటే చాలా ఎక్కువగా ఉందని, దొరికింది మొత్తం సొమ్ములో కొంతేనని అంటున్నారు. రాజేంద్ర ప్రసాద్‌తో పాటు మరో ఐదుగురిని కూడా అరెస్టు చేశారు. కాగా రాజేంద్ర ప్రసాద్‌ ముంబై ఆదాయపన్ను శాఖలో అప్పీళ్ల విభాగంలో కమిషనర్‌గా పనిచేస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu