హరికృష్ణకి ఇంకా ఈ దుర్వార్త తెలియదు...
posted on Dec 6, 2014 7:03PM

నందమూరి జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయాన్ని ఇంకా ఆయన తండ్రి నందమూరి హరికృష్ణకు తెలియజేయలేదని సమాచారం. ఈ వార్తను ఆయనకు అకస్మాత్తుగా తెలియజేస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోనని ఆయన కుటుంబ సభ్యులు భయపడుతున్నారు. ఈ వార్తను ఆయనకు తెలియజేసే సాహసాన్ని ఎవరూ చేయలేకపోతున్నారు. నందమూరి జానకిరామ్‌కి భార్య, కుమారుడు ఉన్నారు. జానకిరామ్ మరణించిన విషయాన్ని వారికి తెలియజేశారు. వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో నందమూరి జానకిరామ్ దుర్మరణం చెందారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఆయన కారుకు ప్రమాదం జరిగింది. నందమూరి హరికృష్ణకు జానకిరామ్ పెద్ద కుమారుడు.