అది ప్రమాదకర మలుపు...
posted on Dec 6, 2014 6:53PM

ప్రమాదకరమైన మలుపు నందమూరి హరికృష్ణ పెద్ద కుమారుడు నందమూరి జానకిరామ్ ప్రాణాలను తీసినట్టు తెలుస్తోంది. నల్గొండ జిల్లా మునగాల మండటం ఆకుపాముల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో జానకిరామ్‌తోపాటు కారు డ్రైవర్ కూడా వున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో జానకిరామ్ కారు నడుపుతున్నట్టు సమాచారం. ఇదిలా వుండగా కారు ప్రమాదానికి గురైన మలుపు చాలా ప్రమాదకరమైన మలుపు అని తెలుస్తోంది. ఈ మలుపులో గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయి. జానకిరామ్ కారు ఈ మలుపు దగ్గరకి వచ్చినప్పుడు రాంగ్ రూట్‌లో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ జానకిరామ్ కారును ఢీకొంది. ఈ మూల మలుపు ప్రమాదకరమని, ఇక్కడ రోడ్డును సరిచేయాలని గతంలో ఎన్నోసార్లు స్థానికులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకపోయింది. ఈ మూల మలుపే ఇప్పుడు జానకిరామ్ ప్రాణాలు బలి తీసుకుంది.