హనుమంతప్ప కూతురు... సైన్యంలో!
posted on Feb 26, 2016 4:52PM
.jpg)
సియాచిన్‌లో ప్రకృతితో పోరాడి, అలసిసొలసి మరణించిన లాన్స్ నాయక్ హనుమంతప్పను ఎవరు మర్చిపోగలరు. హిమపాతంలో కూరుకుపోయినా కూడా ఆరురోజుల పాటు ప్రాణాలను నిలుపుకున్నారు హనుమంతప్ప. చనిపోయేనాటికి హనుమంతప్పకు ఒక చిన్న పాప ఉంది. ఆ పాపను ఎలాగైనా గొప్ప సైనికురాలిగా తీర్చిదిద్దుతానంటున్నారు హనుమంతప్ప భార్య మహాదేవి. ఇవాళ మహారాష్ట్రలో జరిగిన ఓ సన్మాన కార్యక్రమంలో పాల్గొంటూ తనకు ఆడపిల్ల పుట్టిందని ఏనాడూ బాధపడలేదనీ, తన భర్తలాగా, కూతురిని కూడా ధైర్యంకల సైనికురాలిగా తీర్చదిద్దడమే తన లక్ష్యమనీ పేర్కొన్నారు. జేఎన్‌యూలో జరుగుతున్న వివాదం గురించి కూడా మహాదేవి స్పందించారు. భారతదశం మనకు నిలువనీడను ఇచ్చిందనీ, ఆ అవకాశాన్ని దుర్వినియోగం చసుకోవద్దంటూ హితవు పలికారు. దేశం కోసం ప్రాణాలను అర్పించేందుకు సిద్ధంగా ఉండాలే కానీ, జాతి వ్యతిరేకులుగా మారవద్దంటూ ఆమె యువతకు విజ్ఞప్తి చేశారు.