Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అబ్దుల్ కలాం స్ఫూర్తితో రాజకీయ పార్టీ!
posted on: Feb 27, 2016 10:29AM
.jpg)
భారతదేశ అణుసామర్థ్యాన్నీ, అంతరిక్ష ప్రతిభనీ విశ్వవ్యాప్తం చేసిన అబ్దుల్ కలామ్‌ను ఎవరు మర్చిపోగలరు. కేవలం ఒక శాస్త్రవేత్తగానే కాకుండా, భావిపౌరులకు ఆదర్శంగా నిలిచిన అబ్దుల్ కలామ్ ఆదర్శాల స్ఫూర్తితో ఒక రాజకీయ పార్టీ వచ్చే అవకాశం ఉందంటున్నాయి తమిళనాట వర్గాలు. అందుకోసం అబ్దుల్ కలాంకు సలహాదారుగా పనిచేసిన, ఆయనతో కలిసి పుస్తకాలను సైతం వెలువరించిన పొన్‌రాజ్ మీద ఒత్తిడి పెరుగుతున్నట్లు సమాచారం. అందుకోసం నిన్న తమిళనాట వందలాది విద్యార్థులు పొన్‌రాజ్ ఇంటిని చేరుకున్నారు. ప్రస్తుత రాజకీయాలతో తాము విసిగిపోయామనీ, సమాజంలో ఎటు చూసినా అవినీతే కనిపిస్తోందనీ సదరు విద్యార్థులు పేర్కొన్నారు. అబ్దుల్ కలామ్ చూపిన ఆదర్శంతో ఒక రాజకీయ పార్టీని స్థాపించమంటూ వారంతా పొన్‌రాజ్‌ను వేడుకొన్నారు. ఈ విషయం గురించి తన కుటుంబంతో చర్చించి త్వరలోనే ఒక నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు పొన్‌రాజ్ ప్రకటించారు. అదే కనుక నిజమైతే రాజకీయాలలో ఒక కొత్త ఒరవడిని ఆశించవచ్చునేమో!


.jpg)
.jpg)


