చరిత్రలో నిలిచే మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్టాత్మకమైన ప్రయోగానికి సిద్ధమైంది. ప్రతిష్టాత్మకమైన జీఎస్ఎల్వీ మార్క్ 3డీ1 వాహకనౌకను నింగీలోకి పంపేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. రేపు సాయంత్రం 5.38 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించేందుకు ఇస్రో అన్ని ఏర్పాట్లు చేసింది. 3,136 కిలోల బరువు కలిగిన ఈ ఉపగ్రహాన్ని తయారు చేసేందుకు ఇస్రోకి 18 సంవత్సరాలు పట్టింది. ఈ భారీ రాకెట్ ద్వారా అత్యంత బరువైన జీశాట్-19 ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. దేశంలో సమాచార వ్యవస్థ మరింత మెరుగుపడేందుకు, ఇంటర్నెట్ సేవలు మరింత వేగవంతమయ్యేందుకు ఈ ప్రయోగం ఉపయోగపడుతుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu