కాశ్మీర్‌లో ఉగ్రదాడి..సీఆర్‌పీఎఫ్ బెటాలియన్‌పై కాల్పులు

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. భద్రతా బలగాలనే లక్ష్యంగా చేసుకుని బందిపొరా జిల్లాలోని సంబల్ వద్ద గల సీఆర్‌పీఎఫ్ 45వ బెటాలియన్‌పై దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో జవాన్లు గాఢనిద్రలో ఉన్నారు. అయితే కాల్పుల శబ్ధం విన్న వెంటనే తేరుకున్న సైనికులు ఉగ్రవాదులపై ఎదురుకాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో నలుగురు ముష్కరులు హతమయ్యారు. ఈ దాడిలో ఇంకెవరైనా ఉగ్రవాదులు తప్పించుకున్నరేమోనన్న అనుమానంతో భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu