బహుమతులు - వాటి ఫలితాలు

శుభకార్యాలకు బహుమతులు ఇవ్వడం లేదా పుచ్చుకోవడం సహజం. అయితే, కొందరికి ఎలాంటి బహుమతులు ఇవ్వాలో, ఎలాంటివి  తీసుకోకూడదో తెలీదు. ఏదో ఒకటి కొంటారు, వెళ్లి తమ స్నేహితులకో, బంధువులకో ఇస్తారు. అలా ఏదంటే అది కొనుక్కొని వెళ్లి ఇవ్వకూడదని కొందరు జ్యోతిష్యులు చెబుతున్నారు. ఎవరైనా  టవల్స్, కర్చీఫ్ లు బహుమతులుగా ఇస్తే తీసుకోకూడదట. వివాదాలు వస్తాయట. బహుమతిగా ఇస్తే వద్దని చెప్పాలట లేదా వారి చేతిలో ఒక నాణెం పెట్టాలట.

చైనా జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం  నీళ్లతో వున్న వస్తువులు (అక్వేరియం) బహుమతిగా ఇవ్వకూడదు. ఒకవేళ ఇస్తే మీదగ్గర ఉన్న అదృష్టం వారివద్దకు వెళుతుందట. మీరు తరచూ ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కొంటారట. అలాగే పదునైన వస్తువులు ఇవ్వడం లేదా స్వీకరించడం కూడా దురదృష్టమే. పైగా అనారోగ్య సమస్యలు వస్తాయట. తిరస్కరించడం ఉత్తమమని కొందరి జ్యోతిష్యుల భావన.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu