ఫేస్బుక్ వీడియోలు డౌన్లోడ్ చేసుకోవాలా!

ఫేస్బుక్! ఒక పదేళ్ల క్రితం చాలామందికి పరిచయం లేని పదం. కానీ ఇప్పుడో! ఫేస్బుక్ అకౌంటు లేకపోతే అదో లోపంగా భావించే తరుణం. ఫేస్బుక్తో అటు లాభాలు నష్టాలు రెండూ ఉన్నాయి. ఆ చర్చ సంగతి పక్కన పెడితే అడపాదడపా ఫేస్బుక్లో కనిపించే వీడియోలని చూసి, ఓ లైక్ పడేసి.... ‘అబ్బా! ఈ వీడియో మన సొంతం అయితే ఎంత బాగుండో,’ అనిపించక మానదు. దానికేం చేయాలో మీరే చూడండి.

 

మనమే అప్లోడ్ చేసిన వీడియోలను డౌన్లోడ్ చేసుకునేందుకు-

ఒకోసారి ఫేస్బుక్ అకౌంట్లో మనమే ఏదో వీడియో పోస్ట్ చేస్తాం. కానీ దాని తాలూకు కాపీ ఎక్కడో పోతుంది. అలాంటి సందర్భాలలో మన పాత పోస్టుల్లో ఉండే వీడియోని అతి సులభంగా తిరిగి పొందవచ్చు. దీనికి చేయాల్సిందల్లా...

- ఫేస్బుక్లో మీ పేరు, ఫొటో ఉన్న ప్రొఫైల్ సెక్షన్ని క్లిక్ చేయండి.

- అందులో ఫొటోస్ అన్న సెగ్మెంట్ కనిపిస్తుంది.

- ఫొటోస్ని క్లిక్ చేయగానే మీరు పోస్ట్ చేసిన ఫొటోస్, మూవీస్, బుక్స్... అన్నింటితో పాటుగా వీడియోస్ అనే సెగ్మెంట్ కూడా కనిపిస్తుంది.

- వీడియోస్ సెగ్మెంట్లో మీరు కాపీ చేసుకోవాలని అనుకున్న వీడియోని ఎంచుకొని ప్లే చేయండి.

- వీడియో ప్లే అవుతున్న సమయంలో కింద ఆప్షన్స్ అన్న పదం కనిపిస్తుంది.

- ఆప్షన్స్ని క్లిక్ చేయగానే ‘Download SD’ అన్న ఎంపిక కనిపిస్తుంది.

- Download SDని క్లిక్ చేయగానే మరోసారి వీడియో ప్లే అవుతుంది. అలా ప్లే అయ్యే సమయంలో కింద మెనూ బార్లో ఉన్నా డౌన్లోడ్ ఐకాన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది. వీడియో మీ సిస్టమ్లో ఫైల్ సేవ్ అయిపోతుంది.

స్నేహితులు అప్లోడ్ చేసిన వీడియోలను డౌన్లోడ్ చేసుకునేందుకు-

 

ఇతరుల వీడియోలను డౌన్లోడ్ చేసుకునేందుకు ఫేస్బుక్ నేరుగా అవకాశం ఇవ్వదు. అయితే ఇందుకో సులువు ఉంది. అదేమిటంటే...

- మీకు నచ్చిన వీడియో ప్లే అవుతుండగా దాని మీద రైట్ క్లిక్ చేయండి. వెంటనే show video URL అనే ఎంపిక కనిపిస్తుంది.

- ఆ URL అడ్రెసుని అలాగే కాపీ చేసుకోండి. గూగుల్ క్రోమ్లో కొత్త విండోని ఓపెన్ చేసి ఆ అడ్రస్బార్లో మీరు కాపీ చేసిన URLని పేస్ట్ చేయండి.

- అడ్రస్ బార్లో పేస్ట్ చేసిన URLకి చిన్న మార్పు చేయవలసి ఉంటుంది. అడ్రెస్లో ఉండే WWWని తీసివేసి ఆ స్థానంలో M అనే అక్షరాన్ని ఉంచండి. ఇది మొబైల్ యూజర్స్ కోసం కనిపించే ఫేస్బుక్ వెర్షన్.

- ఇప్పుడు వీడియో ప్లే అవుతుండగా, దాని మీద రైట్ క్లిక్ చేయండి. వెంటనే save video as అనే ఎంపిక కనిపిస్తుంది. అంతే దాన్ని క్లిక్ చేయగానే సిస్టిమ్లో మీరు కోరుకున్న చోటుకి వీడియో డౌన్లోడ్ అయిపోతుంది.

- నిర్జర.