అందరూ మిమ్మల్ని ఇష్టపడాలంటే.. ఇలా చేయండి..!


ఇల్లు అయినా,  ఆఫీసు అయినా.. వేరే ఇతర ప్రదేశమైనా.. అందరూ మనల్ని ఇష్టపడాలని,  అందరూ మనకు ఆకర్షితమవ్వాలని,  మనల్ని గౌరవించాలని అనుకోవడంలో తప్పు లేదు. అయితే అన్ని చోట్లా ఈ గౌరవం,  అబిమానం దొరకడం కష్టం. కానీ అసాధ్యం ఏమీ కాదు.  ఈ విషయం గురించి ఆచార్య చాణక్యుడు  చాలా వివరంగా చెప్పాడు.  ఆయన చెప్పిన కొన్ని విధానాలు పాటించడం వల్ల ఆఫీసు అయినా,  ఇల్లు అయినా మరొక ప్రదేశం అయినా అందరూ గౌరవం ఇస్తూ,  ఇష్టపడతారు కూడా. ఇంతకూ చాణక్యుడు చెప్పిన విషయాలేంటో తెలుసుకుంటే..

సమిష్టి కృషి..

ఆచార్య చాణక్యుడి ప్రకారం సమిష్టి కృషితో ముందుకు వెళ్లే వారు అందరి నుండి గౌరవం పొందుతారు. అంతేకాదు అందరూ ఇలాంటి వారిని ఇష్టపడతారు.  తమ పనులు చేసుకుని వెళ్లిపోయే వారి కంటే అందరినీ తమతో కలుపుకుంటూ పనులలో వేగంగా ముందుకు వెళ్ళేవారు ఆపీసులలో మంచి గుర్తింపు,  గౌరవం తెచ్చుకోగలుగుతారు. అంతేకాదు.. అందరికీ ఎంకరేజ్ చేస్తూ ఉండాలి కూడా.

పరిష్కారం..

ఏదైనా ఒక సమస్య వస్తే ఆ సమస్యను తొందరగా పరిష్కారం చేసుకోవడం ఇతరులకు సంబంధించిన సమస్యలను అయినా తొందరగా పరిష్కరించడం చాలా మంచి విషయం. కానీ దురదృష్ట పశాత్తు చాలా మంది సమస్యలను తొందరగా పరిష్కరించడంలో చాలా నిర్లక్ష్యంగా లేదా చాలా జాప్యం చేస్తూ ఉంటారు.  కానీ సమస్యలు ఏవేనా,  ఎవరివి అయినా తొందరగా పరిష్కారం చేస్తే అందరూ గౌరవిస్తారు, ఇష్టపడతారు కూడా.

గౌరవం..

ఆపీసులో అందరినీ గౌరవించాలి. పెద్దవారు అయినా  చిన్నవారు అయినా గౌరవించాలి. అలా వారికి గౌరవం ఇచ్చినప్పుడు ఎదుటివారు కూడా గౌరవం పొందుతారు. తమ కంటే తక్కువ స్థాయి ఉద్యోగస్థులను కూడా గౌరవించే వారిని అందరూ ఎల్లప్పుడూ గౌరవిస్తారు.

అవకాశాలు ఇవ్వడం..

ఇతరులకు అవకాశాలు ఇవ్వడం, అవకాశాలు చూపించడం అనేది ఆపీసులలో ప్రతిభావంతులైన వ్యక్తులు ముందుకు సాగడానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది.  ఒకరి ప్రతిభను ప్రోత్సహించినప్పుడు ఆ వ్యక్తి మాత్రమే కాదు.. ఆ వ్యక్తి ప్రతిభను ప్రోత్సహించిన వ్యక్తి కూడా ఇతరుల నుండి గౌరవం పొందరుతారు.  తద్వారా అందరూ ఇష్టపడతారు.


                                       *రూపశ్రీ.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu