ఐఏఎస్ అధికారి ఆత్మహత్య...

 

కర్ణాటకలో ఓ ఐఏఎస్ అధికారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపిన ఐఏఎస్ అధికారి డీకే రవి సోమవారం తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని మరణించారు. ఉదయం కార్యాలయం నుండి ఇంటికి తిరిగి వచ్చి ప్రాణాలు తీసుకున్నారని, దీన్ని ఆత్మహత్యగానే పరిగణిస్తున్నట్లు పోలీసు కమిషనర్ ఎంఎన్ రెడ్డి తెలిపారు. రవి కోలార్ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేసిన సమయంలో ఇసుక మాఫియాపై కఠిన చర్యలు తీసుకొని మంచి పేరు సంపాదించుకొన్నారు. ప్రస్తుతం ఈయన ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలో అడిషనల్ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. అయితే రవి ఇంట్లో ఎలాంటి సూసైడ్ నోటు లభించలేదని పోలీసులు తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu