బతికేవున్నా.. పుతిన్

 

తానింకా పోలేదని.. బతికేవున్నానని రష్యా అధ్యక్షుడు పుతిన్ కామెడీగా కామెంట్ చేశాడు. ఈమధ్య పది రోజులుగా పుతిన్ అజ్ఞాతవాసానికి వెళ్ళిపోయాడు. బయట ఎక్కడా కనిపించడం లేదు. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. దాంతో ఆయన మీద అనేక పుకార్లు రష్యాలో షికార్లు చేశాయి. పుతిన్ సైనిక కుట్ర కారణంగా పదవి కోల్పోయి నిర్బంధంలో వున్నాడని, తన లేటెస్ట్ గర్ల్‌ఫ్రెండ్ స్విట్జర్లాండ్‌లో పండంటి బిడ్డకు జన్మనివ్వడంతో, తన పోలికల్లోనే వున్న ఆ బిడ్డను చూసి మురిసిపోతున్నాడని పుకార్లు వచ్చాయి. పుతిన్ ఆరోగ్యం దుంపనాశనమైపోయి రహస్యంగా చికిత్స పొందుతున్నాడని కూడా జనం గుసగుసలాడుకున్నారు. చివరికి పుతిన్ చనిపోయాడని కూడా పుకార్లు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో పుతిన్ సోమవారం నాడు బయటకి వచ్చాడు. రష్యా పర్యటనకు వచ్చిన కిర్జిజ్‌స్థాన్ అధ్యక్షుడు అటంబయెవ్‌తో కలసి పుతిన్ సమావేశం అయ్యాడు. ఈ సందర్భంగా పుతిన్ తన అదృశ్యం మీద వచ్చిన పుకార్లను ఖండించాడు. తానింకా బతికే వున్నానని కామెంట్ చేశాడు. ‘‘పుకార్లు మంచివే... పుకార్లు అనేవే లేకపోతే మనకి విసుగొచ్చేస్తుంది’’ అని కూల్‌గా అన్నాడు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu