మినీ డిజిటల్ ఫోటో కీరింగ్..

 

 

 

నచ్చిన వ్యక్తికీ మెచ్చే బహుమతి ఇవ్వాలనిపిస్తుంది. అదీ రొటీన్ గా కాకుండా ఏదైనా ప్రత్యేకంగా ఉండేదయితే బావుంటుందని కూడా అనిపిస్తుంది కదా....అలా ఈ సారి మీరు ఎవరికైనా ప్రత్యేకంగా ఏదన్నా బహుమతి ఇవాలి అనుకుంటే ఇది try చేయండి మీ స్నేహితులు కావాల్సిన వారు ఆ బహుమతిని ఇష్టపడతారు. అదే 'కీ చెయిన్'....

 
ఏంటి కీ చెయిన్ అని  తీసిపారెయ్యకండి నేను చెప్పేది మాములు కీ చెయిన్ గురించి కాదు. 'మినీ డిజిటల్ ఫోటో కీరింగ్ ' మినీ డిజిటల్ అనే పేరు వింటేనే అర్ధమైపోతుంది కదా అవును ఇందులో ఫోటోలు స్టోర్ చేయొచ్చు. సుమారు 60  ఫోటోలు దాకా స్టోర్ చేసుకునే అవకాశం వుంటుంది. అల అని ఇదేదో చాలా పెద్ద ఆకారంలో ఉంటుందనుకుంటున్నారా? లేదండి మనం వాడే మాములు కీ చెయిన్ లా అంతే వుంటుంది. 


హృదయాకారంలో , ఎన్నెన్నో రంగుల్లో దొరికే ఈ కీ చెయిన్ లో నచ్చిన ఫోటోలని దాచుకోవచ్చు అప్పుడప్పుడు చార్జింగ్ పెట్టాల్సి వస్తుంది. ఆ చార్జర్ కూడా ఈ కీ చేయితో దొరుకుతుంది. సో ఈ సారి మీ స్నేహితులకి కావాల్సిన వారి ఫోటో లని చక్కగా ఇందులో స్టోర్ చేసి వాళ్ళకి బహుమతిగా ఇచ్చారనుకోండి థ్రిల్ అయిపోతారు.

-రమ