ఢిల్లీలో కాల్పుల కలకలం.. కలవరం...

 

సోమవారం నాడు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో సోమవారం నాడే ఢిల్లీలో ఢిల్లీలో జరిగిన కాల్పుల ఘటన కలకలం రేపింది. కేంద్ర హోంశాఖకు చెందిన వాహనంపై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఆ వాహనం డ్రైవర్ హైదర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా కాల్పులకు పాల్పడిన దుండగుడు ఉపయోగించిన వాహనాన్ని ఢిల్లీ పోలీసులు గుర్తించారు. ఈ కాల్పుల వెనుక తీవ్రవాద చర్య వుందా, లేక వ్యక్తిగత వివాదమా అనే విషయాన్ని పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu