ఆస్ట్రేలియా మీద ఆశలేం పెట్టుకోవద్దు...
posted on Feb 23, 2015 9:24AM

ఆస్ట్రేలియాలో చదువుకుందామని అనుకుంటున్నారా? అక్కడ ఉద్యోగం చేయాలని భావిస్తునారా? ఆ దేశంలో స్థిరపడాలని అనుకుంటున్నారా? మీ కోరిక మరీ బలమైనది కాకపోతే పెద్దగా ఆశలు పెట్టుకోకండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఆస్ట్రేలియా వెళ్ళడం అనేది చాలా కష్టమైన విషయం కాబోతోంది. ఆస్ట్రేలియా వలస చట్టాటు మరింత సంక్లిష్టం కానున్నాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా వలస చట్టాలు కొరకరాని కొయ్యలా వుంటాయి. వాటిని మరింత జటిలం చేసే ఆలోచనలో వున్నామని ఆ దేశ ప్రధాని టోనీ అబాట్ ప్రకటించారు. ఆస్ట్రేలియా ప్రజల రక్షణ చర్యలు, ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా వలస చట్టాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నామని ఆయన చెప్పారు. గత డిసెంబర్‌లో సిడ్నీ కేఫ్ ఘటన జరిగిన తర్వాత ఆస్ట్రేలియా దేశ భద్రతను చాలా సీరియస్‌గా తీసుకుంటోంది.