తెలంగాణ బడ్జెట్ టీఆర్‌ఎస్ కరపత్రంలా ఉంది: శ్రీనివాస్
posted on Nov 6, 2014 8:06AM
(1).jpg)
నిన్న తెలంగాణా ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెట్టిన తెలంగాణా మొట్టమొదటి బడ్జెట్, తెరాస పార్టీ మ్యానిఫెస్టో లా ఉంది తప్ప బడ్జెట్ లా లేదని మాజీ పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అన్నారు. తెరాస ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం కాకుండా తన ప్రభుత్వ ప్రచారం కోసమే అంకెల గారడీతో బడ్జెట్ ప్రవేశపెట్టినట్లుందని ఆయన విమర్శించారు. ఒకపక్క రుణమాఫీకి తగినన్ని నిధులు లేవంటూనే అంత భారీ బడ్జెట్ ప్రవేశపెట్టడం కేవలం ప్రజలను మభ్యపెట్టడానికేనని ఆయన అభిప్రాయపపడ్డారు. ఇదివరకు తెరాస పార్టీ ఎన్నికలలో హామీలు ఇచ్చినట్లే, ఇప్పుడు బడ్జట్ లో కూడా అనేక గొప్ప గొప్ప హామీలు గుప్పించిందని వాటిలో ఎన్ని అమలుకు నోచుకొంతాయో అని ఆయన సందేహం వ్యక్తం చేసారు. బడ్జెట్ లో ప్రకటించిన ప్రతీ అంశంపై తమ పార్టీ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తుందని ఆయన అన్నారు.