సిపిఎం కు పోటీగా సిపీఐ న్యూస్ ఛానల్

సిద్ధాంతపరమైన వైరుధ్యాలతో పరస్పరం కలహించుకునే రాష్ట్రంలోని సిపీఐ, సిపిఎం పార్టీలు త్వరలో మరో పోటీకి సన్నాహాలు చేస్తున్నాయి. ఎలక్ట్రానిక్ న్యూస్ చానళ్ళ ప్రాదాన్యతను ఆలస్యంగా గమనించిన సిపిఎం త్వరలో ఒక తెలుగున్యూస్ ఛానల్ ను ప్రారంబించాలని నిర్ణయించింది.

 

 

 

 

ఈ ఛానల్ ఏర్పాటు బాధ్యతనంతా పార్టీ మాజీ ఎమ్మెల్యే తమ్మినేని వీరభద్రంకు అప్పగించింది. ఈ విషయం బయటికి తెలిసిన వెంటనే రాష్ట్రంలోని సిపీఐ నాయకుల్లో కలవరం మొదలైంది. అన్నింటిలోనూ సిపిఎం తో పోటీ పడుతున్న తామూ న్యూస్ ఛానల్ విషయంలో వెనుకబడితే ఎలా అనుకున్నారో ఏమో కానీ వెంటనే రంగంలోకి దిగారు. కేంద్ర నాయకత్వం అనుమతి తీసుకున్నారు. రాష్ట్రంలో సిపీఐ తరుపున తెలుగున్యూస్ ఛానల్ ప్రారంభించటానికి సన్నాహాలు చేస్తున్నారు. నిజానికి ప్రస్తుత అంచనాల ప్రకారం పూర్తిస్థాయిలో శాటిలైట్ న్యూస్ ఛానల్ ప్రారంభించాలంటే 40 నుంచి 50కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. ఆ డబ్బులు కొంత చందాల రూపంలో వస్తూలు చేస్తే మిగిలినది బ్యాంకు రుణాలుగా తీసుకోవాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు మాత్రమే అధికారంలో ఉన్నప్పటికీ ఆ పార్టీలకు లేని ఆస్తులు ఈ రెండు కమ్యూనిస్టు పార్టీలకూ ఉన్నాయి. ఈ రెండు పార్టీలకూ పట్టాన, నగర, మండల స్థాయిల్లో కూడా సొంత భూములు ఉన్నాయి. ఈ ఆస్తుల విలువ వందల కోట్లలో ఉంటుంది. అవసరమైతే బ్యాంకులకు ఈ ఆస్తుల్లో కొంతభాగాన్ని ష్యూరిటీ పెట్టి దాంతో చానల్ పెట్టాలని కమ్యూనిస్టుపార్టీల నాయకులు యోచిస్తున్నట్లు తెలిసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu