CBI To Arrest Three Reddy BussinessMan, Penna Group MD Penna Pratap Reddy, Indu Project MD I.Shyam Prasad Reddy, Ramki Group MD Ayodhya Reddy,

వై.ఎస్. రాజశేఖర రెడ్డి హయాంలో అక్రమంగా అనేక ప్రయోజనాలు పొంది దానికి బదులుగా జగన్ సంస్థల్లో పెట్టు బడులు పెట్టిన ముగ్గురు రెడ్డి పారిశ్రామికవేత్తలను సిబీఐ త్వరలో అరెస్టు చేయబోతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగు తోంది. పెన్నా గ్రూపు సంస్థల అధినేత పెన్నా ప్రతాపరెడ్డి, హిందూ ప్రాజెక్టు అధినేత ఐ.శ్యాంప్రసాద్ రెడ్డి, రాంకీ గ్రూపు సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ అయోధ్యారెడ్డిలను వచ్చే రెండు వారాల్లో అరెస్టు చేయవచ్చని తెలుస్తోంది. రాజకీయకారణాల వల్ల జగన్ ను వెంటనే అరెస్టు చేయటం సాధ్యం కాదు కనుక ముందుగా వీరి భరతం పట్టాలని సిబీఐ యోచిస్తున్నట్లు తెలిసింది. 15 రోజుల క్రితం వరకూ సిబీఐ దర్యాప్తు మంద కొడిగా సాగుతోందన్న ప్రచారం జరుగుతున్నా తరుణంలో నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్టు అయ్యారు. కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాలతోనే నిమ్మగడ్డ ప్రసాద్ ను అరెస్టు చేయాలని సిబీఐ నిర్ణయించింది. ఆ తరువాత ప్రతాపరెడ్డి, శ్యాంప్రసాద్ రెడ్డి, అయోధ్యరెడ్డిలను కూడా అరెస్టు చేయటానికి సిబీఐ సన్నాహాలు చేస్తోంది. వీరి అరెస్టు విషయమై సిబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ తమ శాఖ ఉన్నతాధికార్ల నుంచి అనుమతి పొందినట్లు తెలిసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu