అమరావతైనా... అమెరికా అయినా అదే ఫాలోయింగ్....

 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెక్నాలజీని వాడటంలోకానీ... ఆ టెక్నాలజీనీ ప్రజల ముందుకు తీసుకురావడంలోకానీ అందరి రాజకీయ నేతల కన్నా ఒక అడుగు ముందే ఉంటారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పొచ్చు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైటెక్ సిటీ నిర్మాణంతో హైదరాబాద్‌ను ప్రపంచపటంలో నిలబెట్టింది... సాఫ్ట్‌వేర్ విప్లవానికి సృష్టికర్త.. ఐటీకి పర్యాయపదం చంద్రబాబే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది. తెలంగాణకు మిగులు బడ్జెట్ మిగలగా.. ఏపీకి మాత్రం రెవెన్యూ లోటు మిగిలింది. అలాంటి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి చంద్రబాబు ఎన్నో కష్టాలు పడుతున్నారు. అంతేకాదు ఏపీలో కూడా సాంకేతికతకు పెద్ద పీట వేస్తూ.. ఆ దిశగా అభివృద్ధిని సాధిస్తున్నారు. దీనిలోభాగంగానే చంద్రబాబు అమెరికా పర్యటన చేస్తున్నారు.

 

అయితే ఇప్పటివరకూ చంద్రబాబు చేసిన పర్యటనలు ఓ ఎత్తు... ఇప్పుడు చేస్తున్న పర్యటన మరొ ఎత్తు. ఈ పర్యటనతో చంద్రబాబు ఓ రికార్డే సృష్టించారు. ఎందుకంటే సాధారణంగా ఎప్పుడు అమెరికా పర్యటకు వెళ్లినా అక్కడ ఏదో ఒక హోటల్ లో కంపెనీ ప్రతినిధులతో భేటీ అవ్వడం.. ఒప్పందాలు కుదుర్చుకోవడం... ఆ తరువాత హోటల్ లోనే తినడం బస చేయడం వంటివి జరుగుతాయి. అంత ఎందుకు సాక్షాత్తు ప్రధాని మోడీ వెళ్లినా అక్కడి కంపెనీలు, పారిశ్రామికవేత్తలతో భేటీ అయినా అది కేవలం హోటళ్లకు మాత్రమే పరిమితం అవుతుంది. అలాంటిది ఈసారి చంద్రబాబు నాయుడికి మాత్రం అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థ సిస్కో కంపెనీ అధినేత జాన్ చాంబర్స్ చంద్రబాబు బృందానికి అమెరికాలోని తన నివాసంలో ఆతిధ్యం ఇవ్వనున్నారంటేనే బాబు కెపాసిటీ ఏంటో అర్ధమవుతుంది. దీంతో ఎలాంటి సమావేశమైనా.. పవర్ పాయింట్ ప్రజంటేషన్ అయినా హోటళ్లకే పరిమితమవుతుంది. అలాంటిది చంద్రబాబు బృందానికి తన నివాసంలో డిన్నర్ ఇవ్వడంతో ఇదో రికార్డ్‌గా చెబుతున్నారు. అంతేకాదు ఇటీవల ముంబైలో జరిగిన మైక్రోసాఫ్ట్‌ 'ఫ్యూచర్‌ డీకోడెడ్‌' (భవిష్యత్తు ఛేదన) సాంకేతిక సదస్సులో ఆయన పాల్గొని కీలకోపన్యాసం చేశారు. ఆయన ఇంగ్లీష్ సరిగా మాట్లాడలేరు అంటూ కామెంట్లు చేసే నాయకులు ముక్కుమీద వేలు వేసుకునేలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అంతేనా చంద్రబాబు ఇచ్చిన ఉపన్యాసానికి గాను అందరూ standing ovation ఇచ్చారంటేనే అర్ధం చేసుకోవచ్చు.

 

ఇవన్నీ పక్కనబెడితే చంద్రబాబు పై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలు మాత్రం ఒకటి. ఇప్పటికే అమెరికా పర్యటనలో ఉన్న చంద్రబాబుపై ఫిర్యాదుచేసి దేశం కానీ దేశంలో ఏపీ పరవు తీసే ప్రయత్నం చేశారు. చంద్రబాబుపై ఏకంగా మేయరుకు.. పోలీసులకు ఫిర్యాదు చేయగా చివరికి పరిస్థితి రివర్స్ అయి వారే ఖంగు తినే పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు ఎర్రచందనం స్మగ్లర్ల పేరిట 25 మందిని చంపించారు... ఇప్పుడు కూడా నిధుల సేకరణలో భాగంగా అక్కడికి వచ్చారని.. విచారణ జరిపించండి అని.. ఈమెయిల్స్ లో కోరారు. దీనిపై వెంటనే స్పందించిన పోలీసులు అక్కడికి వెళ్లి చూడగా.. సీన్ రివర్స్ లో కనిపించింది. ప్రవాసాంధ్రులు చంద్రబాబుకు ఘనస్వాగతం పలకడం.. ప్రముఖులతో అంతా కోలాహలంగా ఉండటంతో.. ఇదేదో రాజకీయ, అమెరికా ప్రతినిధులతో ఏర్పాటైన ప్రముఖ సమావేశమని భావించి.. వారికి వచ్చిన మెయిల్స్ లో వాస్తవం లేదని గ్రహించారు. అయితే ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే... చర్యలు తీసుకోవడానికి వచ్చిన పోలీసులే చంద్రబాబుకు భద్రత కల్పించారు. దీంతో నేతలు భద్రత ఎందుకు కల్పిస్తున్నారని అడుగగా.. వారికి వచ్చిన మెయిల్స్ గురించి వివరించి.. ఏదైనా భద్రతాపరమైన సమస్యలు ఏర్పడవచ్చు అన్న కారణంగానే తమకు తాముగా భద్రత కల్సిస్తున్నామని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు.


ఈ ఒక్క ఉదాహరణ చాలు చంద్రబాబుతో పెట్టుకుంటే ఏమవుతుందో వైసీపీ నేతలకు తెలియడానికి. అసలు జాన్ చాంబర్స్ అంటేనే టెక్ వరల్డ్ లో ఓ శిఖరం. అలాంటి వ్యక్తి అపాయింట్ మెంట్ అక్కడ ఉన్న అమెరికా ప్రతినిధులకు దొరకడం కూడా కష్టమే. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు అలాంటి గౌవరం దక్కినందుకు ఆనంద పడాలి కానీ.. వైసీపీ నేతలు మాత్రం ప్రతి విషయాన్ని బూతద్దంలో చూసి విమర్శలు చేసినట్టే.. ఈపర్యటనపైన కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. అలాంటి వ్యక్తులతో కనీసం భేటీ కాదుకదా.. అపాయింట్ మెంట్ దక్కడం కూడా జగన్ లాంటి వాళ్లకు కష్టమైన పనే. ఏదో కాన్ఫరెన్స్ హాల్లో కూర్చొని..మీటింగ్ లు పెట్టి.. మైకు దొరికింది కదా అని విమర్శలు గుప్పిస్తే సరికాదు. చెప్పాలంటే చంద్రబాబు జగన్ కు ఈరకంగా ఓ పెద్ద సవాల్ విసిరినట్టే.

 

ఇంకా ఇక్కడ చెప్పుకోవాల్సింది తెలుగు తముళ్ల గురించి. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నాడు కాబట్టి.. జరుగుతున్న అభివృద్ధిని కప్పిపుచ్చడానికైనా విమర్శలు చేస్తుంటాడు. దానికి టీడీపీ నేతలు కూడా వారిలాగే జగన్ అలాంటోడు.. ఇలాంటోడు.. అక్రమాస్తుల కేసులు అంటూ టైం వేస్ట్ చేస్తున్నారే తప్ప.. బాబు చేస్తున్న పనులను ప్రజల్లోకి తీసుకురావడంలో మాత్రం ఫెయిల్ అవుతున్నారు. మీడియా సమావేశాలు పెడతారు... సభలు నిర్వహిస్తారు కానీ... ఎక్కడా కూడా బాబు చేసే పనుల గురించి మాత్రం ప్రస్తావించరు. ప్రపంచంలో అతి పెద్ద ఆటో మొబైల్ కంపెనీల్లో ఒకటైన కియో మోటర్స్ ఏపీలోని అమరావతికి తెచ్చిన ఘనత చంద్రబాబుకే చెల్లిందని..పక్క రాష్ట్రంలో ఉన్న ఓ వ్యక్తి చెబితే కానీ మనకు తెలియని పరిస్థితిలో ఉన్నాం. మరి టీడీపీ నేతలు ఇకనైనా మేల్కొని.. జగన్ పై ఫోకస్ ను తగ్గించి.. చంద్రబాబు చేస్తున్న పనులను ప్రజల్లోకి తీసుకురావడంపై పెడితే బెటర్..

Online Jyotish
Tone Academy
KidsOne Telugu