మహిళా ఐపీఎస్ పై ఎమ్మెల్యే గారి ప్రతాపం.. నోర్మూసుకో..!
posted on May 8, 2017 6:14PM
.jpg)
అధికారం చేతిలో ఉంది కదా అని మన రాజకీయ నాయకులు సామాన్యులపై దురుసుగా ప్రవర్తించిన తీరు ఎన్నో ఘటనల్లో చూశాం. ఇప్పుడు తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది. ఓ బీజేపీ ఎమ్మెల్యే మహిళా ఐపీఎస్ అధికారిపై నోరుపారేసుకున్నాడు. ఈ ఘటన యూపీలో చోటుచేసుకుంది. గోరఖ్‌పూర్ నగరంలోని కరీమ్‌నగర్ ప్రాంతంలో మద్యం దుకాణం తొలగించాలని డిమాండ్ చేస్తూ అక్కడి స్థానికులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న గోరఖ్‌పూర్ బీజేపీ ఎమ్మెల్యే రాధామోహన్ దాస్ చారు నిగమ్‌తో వాగ్వాదానికి దిగారు. ‘నోర్మూసుకుని ఉండు. నేను నీతో మాట్లాడడం లేదు. హద్దు మీరొద్దు. నాకు పాఠాలు చొప్పొద్దు. నా సహనాన్ని పరీక్షించొద్ద’ని ఆమె వైపు చేతివేలు చూపించి వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యే దురుసు ప్రవర్తనతో ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. తన పట్ల ఎమ్మెల్యే అమర్యాదగా ప్రవర్తించారని, మహిళతో మాట్లాడుతున్నానన్న విచక్షణ మర్చిపోయారని చారు నిగమ్ ఆరోపించారు. అయితే దీనిగాను ఎమ్మెల్యే తాను ఉన్నతాధికారితో మాట్లాడుతుంటే ఆమె మధ్యలో జోక్యం చేసుకున్నారని చెప్పుకొచ్చారు.