పసిపిల్లల్ని చంపొద్దు: హీరో శ్రీకాంత్

 

హైదరాబాద్‌లో ఒక ప్రొఫెసర్ తన ఇద్దరు కుమారులను చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంచలనం సృష్టించింది. ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతూనే వున్నాయి. పిల్లల్ని చంపి తల్లిదండ్రులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి సంఘటనల మీద హీరో శ్రీకాంత్ స్పందించారు. సంసార జీవితంలో సమస్యలు ఎదురైతే ధైర్యంగా ఎదుర్కొవాలని, ఆత్మహత్యకు పాల్పడవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. జీవితం చాలా చిన్నదని, మనస్పర్థలతో దాన్ని పాడుచేసుకోవద్దని చెప్పారు. పెద్దల పంతాలకు పిల్లలను బలిచేయొద్దని శ్రీకాంత్ విజ్ఞప్తి చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu